ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

యాదగిరిగుట్టలో ప్రారంభ‌మైన కోటి పుష్పార్చన.

యాదగిరిగుట్టలో ప్రారంభ‌మైన కోటి పుష్పార్చన.

యాదాద్రి భువనగిరి: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19.
 

కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తముగా ప్రారంభమైంది. శ్రీ స్వామివారికి.

కోటి నామాలు, కోటి పుష్పాలతో అర్చన నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఈసందర్భంగా వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాములు శ్రీ స్వామివారి సహస్రనామావళిని పఠిస్తూ కోటి నామాలతో కోటి పుష్పార్చన నిర్వహిస్తున్నారు.
నేటి నుండి నిరంతరాయంగా శాస్త్రోక్త విధానంలో నామావళి పారాయణం చేస్తూ పుష్పార్చన కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు (20-11-2026) మధ్యాహ్నం.

వరకు కొనసాగి సంపూర్ణం కానుంది. కార్తీక మాస పవిత్రతను, శ్రీ స్వామివారి దివ్య వైభవాన్ని చాటిచెప్పే ఈ కోటి పుష్పార్చన కార్యక్రమం యాదగిరిగుట్ట క్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.